“సుపరిపాలనలో తొలి అడుగు” మంత్రి బీసీ జనార్థన్ రెడ్డి
* నేడు బనగానపల్లి నియోజకవర్గం సంజామల మండలం ఆల్వకొండ గ్రామంలో “సుపరిపాలనలో తొలి అడుగు” కార్యక్రమంలో పాల్గొన్న రాష్ట్ర రోడ్లు మరియు భవనాలు, పెట్టుబడులు, మౌలిక సదుపాయాల శాఖ మంత్రి బీసీ జనార్థన్ రెడ్డి..
* ఈ కార్యక్రమంలో భాగంగా నేడు ఆల్వకొండ గ్రామానికి విచ్చేసిన మంత్రికి ఘనస్వాగతం పలికిన గ్రామ ప్రజలు, స్థానిక కూటమి నేతలు, కార్యకర్తలు...
* ఆల్వకొండ గ్రామంలో హౌసింగ్ కాలనీలో రూ. 20 లక్షలతో నిర్మించిన అంతర్గత సిమెంట్ రోడ్డు నిర్మాణంను ప్రారంభించిన మంత్రి బీసీ జనార్థన్ రెడ్డి..
* రాష్ట్రంలో కూటమి ప్రభుత్వ పాలనలో తొలి ఏడాది విజయవంతంగా పూర్తి చేసిన నేఫథ్యంలో “సుపరిపాలనలో తొలి అడుగు” కార్యక్రమంలో భాగంగా నేడు ఆల్వకొండ గ్రామంలో నేటి సాయంత్రం నుంచి రాత్రి వరకు ఇంటింటికీ తిరిగి గతేడాది కాలంలో కూటమి ప్రభుత్వం అందించిన అభివృద్ధి – సంక్షేమంతో కూడిన సుపరిపాలన గురించి ప్రజలకు వివరించి, కరపత్రాలు పంపిణీ చేసిన మంత్రి బీసీ జనార్థన్ రెడ్డి
* ఎన్నికల్లో ఇచ్చిన హామీకి కట్టుబడి, ఆర్ధిక ఇబ్బందులున్నా... సూపర్ సిక్స్ లో భాగంగా అన్ని పథకాలను అమలు చేస్తున్నట్లు ప్రజలకు తెలియజేసిన మంత్రి
రాష్ట్రంలో కూటమి ప్రభుత్వ పాలనలో తొలి ఏడాది విజయవంతంగా పూర్తి చేసిన నేఫథ్యంలో “సుపరిపాలనలో తొలి అడుగు” కార్యక్రమంలో భాగంగా నేడు సంజామల మండలం ఆల్వకొండ గ్రామంలో నిర్వహించిన సభలో మంత్రి బీసీ జనార్థన్ రెడ్డి ప్రసంగం
ఆర్థిక ఇబ్బందులు ఎన్ని ఉన్నా ప్రజలకు ఇచ్చిన హామీ మేరకు సూపర్ సిక్స్ అమలు చేస్తున్నాం
రాష్ట్రంలో అభివృద్ధి సంక్షేమ పథకాలు కూటమి ప్రభుత్వంలో అందుతున్న తీరుపై క్షేత్రస్థాయిలో పర్యవేక్షించేందుకు ముఖ్యమంత్రి చంద్రబాబు సూచన మేరకు నేడు ఇంటింటికి తిరిగి ప్రజల అభిప్రాయాలు తెలుసుకుంటున్నాం
ఆగస్టు 15 నుంచి జిల్లా వ్యాప్తంగా మహిళలు ఉచితంగా ఆర్టీసీ బస్సులో ప్రయాణించే అవకాశం కల్పిస్తున్నాం
మేము అధికారం చేపట్టిన తర్వాత ఒకేసారి పెన్షన్ రూ. 3000 నుంచి 4000 కి పెంచి.. రెండు నెలల పెన్షన్ మొత్తం రూ. 7000 బోనస్ గా ఇచ్చాం
సూపర్ సిక్స్ పై నాడు ఎన్నికల్లో వైసీపీ విష ప్రచారం చేసిన ప్రజలు కూటమి ప్రభుత్వాన్ని నమ్మి మమ్మల్ని గెలిపించారు
నాడు అమ్మ ఒడి పేరుతో అమ్మకే మోసం చేస్తే.. మేము తల్లికి వందనం పేరుతో ఇంట్లో ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి పథకం అమలు చేస్తున్నాం
నేడు సచివాలయ సిబ్బంది ద్వారా 1 వ తేదీనే పింఛన్ల పంపిణీ చేస్తున్నాం
నాడు 151 సీట్లు ఇచ్చిన ప్రజలు.. నేడు మీ పరిపాలన అవసరం లేదని 11 సీట్లకే పరిమితం చేశారు
ప్రతిపక్ష హోదా కూడా మీకు దక్కలేదంటే.. ప్రజలు మిమ్మల్ని తిరస్కరించారు.. మీకు కనీసం పార్టీ నడిపే నైతిక అర్హత కూడా లేదు
నేడు కేవలం రాజకీయ ఉనికి కోసం గ్రామాలలో కులాలను రెచ్చగొడుతూ.. అరాచకం, దౌర్జన్యంతో మళ్లీ అధికారంలోకి రావాలని చూస్తున్నారు
మీరు అధికారంలోకి రావాలని ఎన్ని కలలు కన్నా ప్రజా తీర్పు మీకు వ్యతిరేకంగానే ఉంటుంది
మేము నేడు ప్రజల్లోకి వెళ్తూ అనునిత్యం సంక్షేమ పథకాలు ప్రజలకు ఏ విధంగా అందుతున్నాయో అడిగి తెలుసుకుంటున్నాం.. మీ మాదిరి పరదాల చాటున పరిపాలన చేయడం లేదు.
త్వరలోనే సూపర్ సిక్స్ అమలును పూర్తి చేసి.. అభివృద్ధిపై మరింత దృష్టి పెడతాం.
గత ఐదేళ్లలో ఆల్వకొండ గ్రామ ప్రజలకు వైసీపీ నాయకులు ఏం చేశారో చెప్పాలి
వైసిపి నేతలకు ప్రజలు బుద్ధి చెప్పిన ఇప్పటికీ పాదయాత్ర.. దండయాత్ర అంటున్నారు..
మా ప్రభుత్వం విజయవంతంగా సూపర్ 6 ను విజయవంతంగా అమలు చేస్తున్నందుకు మీరు పాదయాత్ర చేయాలనుకుంటున్నారా..?
మీరు ఓడిపోయి ఏడాది కాకుండానే అప్పుడే రౌడీలను పరామర్శ పేరుతో రాజకీయం చేస్తున్నారు
అధికారంలో ఉన్నప్పుడు వేలాది మంది పోలీసులతో పరదాల చాటున యాత్రలు చేసిన జగన్మోహన్ రెడ్డికి.. ఇప్పుడు ప్రజల సమస్యలు.. పాదయాత్ర గుర్తొచ్చిందా ?
నాడు మీరు అధికారంలో ఉండగా ప్యాలెస్ లో ఉండి పాలన చేస్తే.. నేడు ప్రజా సమస్యలపై మేము ప్రజల వద్దకే వెళ్లి ప్రజా పాలన అందిస్తున్నాం..
గతంలో ఆల్వకొండ గ్రామ ప్రజలకు ఇచ్చిన హామీ మేరకు గ్రామంలో మౌలిక సదుపాయాల కల్పన లో భాగంగా ముఖ్యంగా రహదారుల నిర్మాణం, డ్రైన్లు వంటి సమస్యలకు శాశ్వత పరిష్కారం చూపాలని అధికారులను ఆదేశించిన మంత్రి..
ఇప్పటికే ఆల్వకొండ గ్రామంలో రూ. 20 లక్షలతో సిసి రహదారులు ఏర్పాటు చేయడం జరిగింది. భవిష్యత్తులో మరో రూ. 14 లక్షలతో సిసి రోడ్ల నిర్మాణం చేపడతాం
ఇప్పటికే వైసీపీ నేతల అరాచకాలపై హెచ్చరించాం.. ఇకపై తోక జాడిస్తే పోలీసులు చట్టపరంగా చర్యలు తీసుకుంటారు..
గ్రామంలో ప్రశాంత వాతావరణము చెడగొట్టే అరాచక శక్తులు విషయంలో కఠినంగా వ్యవహరించాలని పోలీసులకు సూచించిన మంత్రి
త్వరలో అర్హులైన ప్రతి ఒక్కరి రైతుకి అన్నదాత సుఖీభవ అందిస్తున్నాం..
ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ తీసుకొచ్చి మన ఆస్తులపై జగన్మోహన్ రెడ్డి బొమ్మ వేసుకున్నాడు
ప్రచార యావతో సరిహద్దు రాళ్లపై కూడా బొమ్మలు వేయించుకున్నాడు
What's Your Reaction?
Like
0
Dislike
0
Love
0
Funny
0
Angry
0
Sad
0
Wow
0